ర్యాగింగ్ ఆరోపణలు.. ప్రొఫెసర్‌‌పై సస్పెన్షన్‌ వేటు

ర్యాగింగ్ ఆరోపణలు.. ప్రొఫెసర్‌‌పై సస్పెన్షన్‌ వేటు

AP: తిరుపతి ఎస్వీ వర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్ విశ్వనాథ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. విద్యార్థునుల ఫిర్యాదులపై యాంటి ర్యాగింగ్ కమిటీ విచారణ జరిపి నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగా విశ్వనాథరెడ్డిని తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తూ వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. తుది ఆదేశాలు అందిన తర్వాత తదుపరి చర్యలకు ఉపక్రమిస్తామని పేర్కొన్నారు.