'పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలి'
MNCL: దండేపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలని దండేపల్లి మండల ప్రత్యేక అధికారి దుర్గాప్రసాద్ ఆదేశించారు. సోమవారం మండలంలోని కొరివిచెల్మా, రెబ్బెనపల్లి, తదితర గ్రామాలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రసాద్ పాల్గొన్నారు.