'కళాకారులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి'
NDL: మహానందిలో కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ ప్రజా నాట్య మండలి నేతలు కోరారు. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర హోటల్ వద్ద నిర్వహించిన సమావేశంలో జిల్లా సబ్ కమిటీ కన్వీనర్ నాగరాజు, సీపీఐ కార్యదర్శి సామేలు ఇవాళ మాట్లాడారు. అర్హులైన కళాకారులపై సర్వే చేసి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దస్తగీర్ వలి, గురుమూర్తి, హుసేన్ భాషా పాల్గొన్నారు.