'దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకం'
ప్రకాశం: దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని మై భారత్ ప్రతినిధి శ్రీధర సుబ్బారావు అన్నారు. బుధవారం మార్కాపురంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో మై భారత యువ మండల వికాస్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టారు. యువజన సంఘాలు యువతను ఒక వేదిక పైకి తీసుకువచ్చి నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, క్రమశిక్షణ వంటివి పెంపొందించేలా సహాయపడతాయని పేర్కొన్నారు.