VIDEO: మేడారంలో ఇనుప గ్రిల్స్ ఎక్కి దూకిన భక్తుడికి గాయాలు
MLG: మేడారం మహా జాతరలో వనదేవతల దర్శనానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. రద్దీ నియంత్రణకు పోలీసులు గద్దెల గేట్లకు తాళాలు వేశారు. దర్శన ఆత్రుతతో కొందరు భక్తులు ఇనుప గ్రిల్స్ ఎక్కి లోపలికి దూకేందుకు ప్రయత్నించగా, ఓ భక్తుడు కిందపడడంతో కాలు విరిగింది. అతడిని రెస్క్యూ సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భక్తులు సంయమనం పాటించాలని అధికారులు కోరారు.