పుతిన్ రాక వేళ.. భారత్-రష్యా మెగా డీల్..!
భారత్ పర్యటనకు రష్యా అధ్యక్షుడు పుతిన్ వస్తున్న వేళ ఇరు దేశాల మధ్య మెగా డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. మాస్కోకు చెందిన అణు జలాంతర్గామిని భారత్ లీజుకు తీసుకునేందుకు ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరినట్లు సమాచారం. ఈ మేరకు రష్యాకు 2 బిలియన్ డాలర్లు చెల్లించేందుకు భారత్ సిద్ధమైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలను ప్రచురించింది.