వాహన దారులకు హెచ్చరిక

WNP: జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. మదనపూర్ సమీపంలోని సరళ సాగర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీని కారణంగా కొత్తకోట-ఆత్మకూరు రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు. ఈ రహదారి వైపుగా వచ్చి తమ ప్రయాణాన్ని ఇబ్బందికరంగా మార్చుకోవద్దని కోరారు.