అనంతపురంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

అనంతపురంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

ATP: జిల్లా పరిషత్ కార్యాలయంలోని DPRC భవనంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, జడ్పీ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భాషా ప్రయుక్త రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన ప్రాణత్యాగం అజరామరమని కొనియాడారు.