ధోనీ అడ్డాలో కోహ్లీ హవా

ధోనీ అడ్డాలో కోహ్లీ హవా

మహేంద్ర సింగ్ ధోనీ సొంత మైదానం రాంచీలో మ్యాచ్ అంటే చాలు, కింగ్ విరాట్ కోహ్లీ చెలరేగిపోతున్నాడు. ఇక్కడ ఆడిన ఐదు ఇన్నింగ్స్‌ల్లో.. మూడు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఈ స్టేడియంలో అతని బ్యాటింగ్ సగటు ఏకంగా 173గా ఉంది. ఈ గణాంకాలే చెబుతున్నాయి... రాంచీ పిచ్‌పై కోహ్లీ ఆధిపత్యం ఏ విధంగా సాగుతుందనేది.