విషాదం... గీత కార్మికుడు మృతి

విషాదం... గీత కార్మికుడు మృతి

MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన గట్టు మల్లయ్య (65) రోజు మాదిరిగానే శనివారం మధ్యాహ్నం తాటి వనంలో తాటి చెట్టు ఎక్కుతున్న క్రమంలో మోకు జారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన స్థలానికి తొర్రూరు రెండవ ఎస్సై శివరామకృష్ణ చేరుకొని పంచనామ నిమిత్తం మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.