దాబాలో దాడులు.. అక్రమ మద్యం సీజ్

KMR: పిట్లం శివారులోని వెంగ బాయ్స్ దాబాపై పోలీసులు బుధవారం అర్ధరాత్రి దాడి చేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా మద్యం అమ్ముతున్నట్లు గుర్తించారు. వెంటనే ఆ మద్యాన్ని సీజ్ చేసి, దాబా యజమానిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకట్ రావ్ గురువారం తెలిపారు. దాబాల్లో అక్రమంగా మద్యం అమ్మకాలు, సిట్టింగ్ నడిపిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.