పాలేరు జలాశయంలో మత్స్యకారుడు మృతి

పాలేరు జలాశయంలో మత్స్యకారుడు మృతి

KMM: కూసుమంచి మండలం పాలేరు జలాశయంలో చేపల వేటకు వెళ్లి ఎర్రగడ్డ తండాకు చెందిన బానోత్ వాల్య(65)అనే మత్స్యకారుడు మృతి చెందాడు. తండావాసుల కథనం ప్రకారం.. నిన్న సాయంత్రం చేపల వేటకు వెళ్లిన వాల్యకు చేపల వలలు కాళ్లకు చుట్టుకుని నీటిలో మునిగి పోయాడు. ఈరోజు ఉదయం గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.