సందర్శన సమయంలో మార్పు..

NLG: నాగార్జునసాగర్ సమీపంలోని బుద్ధవనం సందర్శన వేళలను నేటి నుంచి గంట పొడిగించినట్లు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు తెలిపారు. గతంలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సమయం ఉండేది. నాగార్జునసాగర్ గేట్లు ఎత్తడంతో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉందని దీంతో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సందర్శన సమయాన్ని పొడిచినట్లు అధికారులు వెల్లడించారు.