మధుపాడలో అగ్నిప్రమాదం

మధుపాడలో అగ్నిప్రమాదం

VZM: గజపతినగరం మండలంలోని మధుపాడ గ్రామంలోని మురళి లేఔట్‌లో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మామిడి అప్పారావుకు చెందిన మామిడి తోట కాలిపోయింది. సుమారు పదివేల రూపాయలు ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. పొగ తాగి పారవేయడం వల్ల ప్రమాదం సంభవించిందని స్థానికులు అంటున్నారు.