'వచ్చే సోమవారంలోగా దుకాణాలు ఖాళీ చేయాలి'
MLG: వెంకటాపురంలో రహదారిని ఆక్రమించి ఏర్పాటు చేసిన కూరగాయల దుకాణాలను వచ్చే సోమవారం ఉదయం లోపు ఖాళీ చేయాలని పంచాయతీ అధికారులు రెండోసారి నోటీసులు జారీ చేశారు. గ్రామ పంచాయతీ, పోలీసుల సంయుక్త చర్యల్లో భాగంగా వ్యాపారులకు వారంరోజుల గడువు ఇచ్చారు. రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనుల కోసం ఆక్రమణల తొలగింపు చేపడుతున్నట్లు తెలిపారు.