'సమయపాలన పాటించని వైద్యులపై చర్యలు తీసుకోవాలి'

SRD: సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని సీపీఎం నాయకులు బుధవారం పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారికి అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏరియా కార్యదర్శి యాదగిరి మాట్లాడుతూ.. 12 గంటల వరకు కూడా వైద్యులు రాకపోవడం సరికాదని చెప్పారు. నిర్లక్ష్యం వహించే వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.