తొండూరులో రోడ్డు ప్రమాదం.. ఒకరికి గాయాలు
KDP: తొండూరు మండలం బూచుపల్లి గ్రామం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. మల్లెల నుంచి వస్తున్న బైక్, బోడివారిపల్లి నుంచి పులివెందుల వైపు వెళ్తున్న మరో బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో బోడివారిపల్లి గ్రామానికి చెందిన నరసింహ రెడ్డికి గాయాలయ్యాయి, గాయపడిన వ్యక్తిని స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.