చెంగిచెర్లలో 600 గజాల పార్కును కాపాడిన హైడ్రా..!

మేడ్చల్: మేడిపల్లి మండలం చెంగిచర్ల గ్రామంలోని పెద్ద క్రాంతి కాలనీలోని 600 గజాల పార్కును హైడ్రా రక్షించింది. పార్కును బై నంబర్లు వేసి అమ్ముతున్నారంటూ నివాసితులు ఫిర్యాదు చేయగా, హైడ్రా విచారించి లేఅవుట్ ప్రకారం అది పార్కు స్థలమని నిర్ధారించింది. వెంటనే హద్దులు గుర్తించి చుట్టూ ఫెన్సింగ్ వేసినట్లు హైడ్రా పేర్కొంది.