విడాకులు లేకుండా మరో పెళ్లి చేసుకున్న భర్తపై ఫిర్యాదు

విడాకులు లేకుండా మరో పెళ్లి చేసుకున్న భర్తపై ఫిర్యాదు

కృష్ణా: మచిలీపట్నం విడాకులు లేకుండా భర్త మరో వివాహం చేసుకున్నాడంటూ సురేఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2020లో రామ్ చరణ్‌ను వివాహం చేసుకున్న ఆమె, పెళ్లి తరువాత చిత్రహింసలు, అక్రమ సంబంధాలు, బలవంతపు అబార్షన్‌కు గురయ్యిందని ఆరోపించింది. మూడు రోజుల క్రితం అతడు మరో వివాహం చేసుకున్నట్టు తెలియడంతో శుక్రవారం పోలీసులను ఆశ్రయించింది.