తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

W.G: అత్తిలి మండలం బల్లిపాడు గ్రామానికి చెందిన కృష్ణకుమారి ఈ నెల 2న హైదరాబాద్‌లో కొడుకు ఇంటికి వెళ్లారు. తిరిగి గురువారం ఇంటికి వచ్చేసరికి తలుపు తెరచుకొని ఉండటం గమనించారు. లోపలికి వెళ్లి చూడగా రూ.85,000 విలువ గల వెండి వస్తువులు, రూ.10,000 నగదును దొంగిలించారని వాపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేంద్రకుమర్ తెలిపారు.