'విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలి'
SRD: విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. సంగారెడ్డిలోని గిరిజన బాలుర లా కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలల సంరక్షణ చట్టం, పొక్సో చట్టం, సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, బాల కార్మిక నిరోధక చట్టం, భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, విధులపై అవగాహన కలిగి ఉండాలన్నారు.