విశాఖలో బంగారం చోరీ

విశాఖలో బంగారం చోరీ

Vsp: విశాఖ స్టీల్ ప్లాంట్ టౌన్ షిప్‌లో శనివారం సాయంత్రం చోరీ జరిగింది. డీజీఎం నల్లి సుందరం తన భార్యతో కలిసి బయటికి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో వస్తువులన్నీ పడి ఉండటాన్ని గుర్తించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి వెళ్లి సీఐ శ్రీనివాసరావు పరిశీలించారు. ఇంట్లో 24 తులాల బంగారం చోరీ అయినట్టు CI తెలిపారు.