భారీ వర్షాలపై మంత్రి ఉత్తమ్ సమీక్ష

NLG: భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లపై మంత్రి ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష నిర్వహిస్తున్నారు. కృష్ణ, గోదావరి బేసిన్‌లోని అన్ని జలాశయాలల్లో ప్రస్తుత వరద పరిస్థితిపై అరా తీస్తున్నారు. నీటి ప్రవాహం స్థాయి, నీటి విడుదల, ప్రాజెక్టులలో అన్ని పంపులు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయా లేదా అని ఇరిగేషన్ అధికారులతో సమీక్షిస్తున్నారు.