అనారోగ్యంతో 'బలగం' నటుడు

అనారోగ్యంతో 'బలగం' నటుడు

WGL: రామన్నపేటకు చెందిన వెండితెర, బుల్లితెర నటుడు గుడిబోయిన బాబు(జీవి బాబు) కొంతకాలంగా మూత్ర పిండాల సమస్యలతో బాధపడుతున్నాడు. మందులు, వైద్యం చేయించడానికి డబ్బులు లేక ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నట్టు కుటుంబ సభ్యులు, వరంగల్ రంగస్థల కళాకారులు తెలిపారు. 'బలగం' సినిమాలో కొమరయ్య తమ్ముడిగా అంజన్న పాత్రలో నటించారు. దాతల కోసం ఎదురు చూస్తున్నారు.