కలెక్టరేట్‌లో ఈ నెల 8న వర్క్‌షాప్: డా. శ్రీరామ్
MDK: మెదక్ కలెక్టరేట్‌లో ఈ నెల 8న జాతీయ రక్షిత మాతృత్వ దినోత్సవ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డా. శ్రీరామ్ తెలిపారు. సురక్షిత ప్రసవాలు, గర్భిణీల సంరక్షణపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. ఇందులో స్త్రీ వైద్య నిపుణులు, ANMలు, అంగన్వాడీలు, గర్భిణీలు పాల్గొంటారని వివరించారు. మాతృ మరణాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.