'ట్రాక్టర్ బోల్తా.. ఒకరు మృతి'

W.G: ఇటుకల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతి చెందిన ఘటన బుధవారం తణుకు జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పాత టోల్ గేట్ సమీపంలో ఇటుకల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఒకరు ఘటనా స్థలంలోనే మృతిచెందగా మరో ముగ్గురు తీవ్ర గాయాలు పాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.