VIDEO: లక్ష్మీనరసింహ స్వామి విగ్రహ ప్రతిష్ట వేడుకలు
CTR: పుంగనూరు(మం) వనమలదిన్నె గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి నూతన విగ్రహ ప్రతిష్ట వేడుకలు ప్రారంభమయ్యాయి. శనివారం వేదంపండితులు గణపతి పూజతో హోమాలు, పూజ కార్యక్రమాలు ప్రారంభించారు. ఆదివారం వేకువ జామున విగ్రహ ప్రతిష్ఠాపన జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ మహోత్సవాల్లో భక్తులు పాల్గొనాలని కోరారు.