రెడ్డి వారి వీధిలో అగ్ని ప్రమాదం

రెడ్డి వారి వీధిలో అగ్ని ప్రమాదం

అన్నమయ్య: రాజంపేట పట్టణం రెడ్డివారి వీధిలోని ఓ ఇంటిలో ఇవాళ అగ్నిప్రమాదం జరిగింది. సకాలంలో మంటలను అదుపులోకి తేవడం వల్ల పెద్ద నష్టం జరగలేదని ఇంటి యజమాని తెలిపారు. చౌడేశ్వరి దేవాలయం ఎదురుగా ఉన్న ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. వేసవికాలం మొదలైనప్పటి నుంచి రాజంపేటలో అగ్ని ప్రమాదాలు పెరిగాయన్నారు. విద్యుత్ శాఖ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా వెల్లడించారు.