ఇద్దరి యువకులపై పోక్సో కేసు

కృష్ణా: కృత్తివెన్ను మండలంలో మైనర్ బాలికను బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకున్న యువకుడితో పాటు అతనికి సహకరించిన మరొక యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పైడిబాబు తెలిపారు. దర్యాప్తు పూర్తయిన అనంతరం ఇద్దరు యువకులను రిమాండ్‌కు తరలించామని చెప్పారు. 18 సంవత్సరాలలోపు ఉన్న బాలికలను ప్రేమ పేరుతో వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.