శోభాయాత్రకు పటిష్ట పోలీస్ బందోబస్తు: ఎస్పీ

NRPT: జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు శుక్రవారం ఎస్పీ యోగేష్ గౌతమ్ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 58 చోట్ల హనుమాన్ శోభాయాత్రలు నిర్వహిస్తున్నారని చెప్పారు. శోభాయాత్రను సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి పరిశీలిస్తామని తెలిపారు.