సమస్యలు పరిష్కరించాలని ఆందోళన
AKP: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అనకాపల్లి కలెక్టరేట్ వద్ద శుక్రవారం ధర్నా చేపట్టారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగరావు మాట్లాడుతూ.. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగన్వాడీలకు వేతనాలు పెంచాలన్నారు. 2023లో 42 రోజులు పాటు సమ్మె చేసిన అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు.