మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ మృతి
NGKL: నాగర్ కర్నూల్ మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జె. రామచంద్రారెడ్డి అనారోగ్యంతో బుధవారం HYD అపోలో ఆసుపత్రిలో మృతి చెందారు. విద్యాశాఖలో ప్రధానోపాధ్యాయుడు, ఎంఈవోగా సేవలందించి విద్యారంగానికి విశేష కృషి చేశారు. ఆయన మృతిపై తెలంగాణ విశ్రాంత ఉద్యోగ సంఘం సభ్యులు సంతాపం వ్యక్తం చేసి నివాళులర్పించారు.