తాడేపల్లిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం
GNTR: తాడేపల్లి పరిధిలోని పాత ప్యారి కంపెనీ సమీపంలోని ఓ నివాసంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంగళవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా చెలరేగడంతో స్థానికులు పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న మంగళగిరి అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రమాదం జరిగిన సమయంలో నివాసంలో ఎవరు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.