యూరియా కోసం క్యూ లైన్‌లో రైతులు

యూరియా కోసం క్యూ లైన్‌లో రైతులు

VKB: రైతులకు పంటలకు సరిపడా యూరియా, ఎరువులు సరఫరా చేసి న్యాయం చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని ఫర్టిలైజర్ షాప్‌ల వద్ద యూరియా కోసం రైతులు క్యూ లైన్‌లో నిలబడి ఇబ్బందులకు గురయ్యారు. వారు మాట్లాడుతూ.. రైతు పాసుబుక్‌పై కేవలం నాలుగు బస్తాలు మాత్రమే ఇస్తామంటున్నారని, పంటలకు సరిపడా యూరియా అందించి రైతులకు న్యాయం చేయాలన్నారు.