'రూ.2,300 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా సంగం డెయిరీ'
GNTR: చేబ్రోలు (M) వడ్లమూడి సంగం డెయిరీ సోమవారం 12వ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశములో డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడారు. తాను ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు 45వేల లీటర్లు మాత్రమే సేకరణ జరిగేదని, ఇప్పుడు రోజుకు 10లక్షల లీటర్లకు పైగా పాల సేకరణ చేస్తున్నామని తెలిపారు. డెయిరీ ఈ సంవత్సరం రూ.2,018.67 కోట్ల రెవెన్యూ పొందిందని తెలిపారు.