చింతచెట్టు పైనుంచి పడి యువకుడికి తీవ్ర గాయాలు

చింతచెట్టు పైనుంచి పడి యువకుడికి తీవ్ర గాయాలు

అన్నమయ్య: మదనపల్లి మండలంలో మంగళవారం, గంగన్నగారిపల్లికి చెందిన రవి (38) అనే యువకుడి తీవ్ర గాయాలు అయ్యాయి. నిమ్మనపల్లి రోడ్డులోని పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో చింతకాయలు కోసేందుకు వెళ్ళినప్పుడు ప్రమాదవశాత్తు చింతచెట్టు పైనుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. చెట్టుపై నుంచి కింద పడటంతో అతనికి బలమైన గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు.