'అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించాలి'

'అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించాలి'

PPM: అగ్నిప్రమాదాలు సంభవించేటప్పుడు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని పాలకొండ అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు సూచించారు. స్థానిక అగ్నిమాపక కార్యాలయం వద్ద సిబ్బందికి పలు సూచనలు చేశారు. అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలను చైతన్యం చేయాలని, వారు ప్రమాదానికి గురి కాకుండా ఉండడంతో పాటు ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించేలా అవగాహన కల్పించాలన్నారు.