అమావాస్య సందర్భంగా కాలభైరవునికి ప్రత్యేక పూజలు

అమావాస్య సందర్భంగా కాలభైరవునికి ప్రత్యేక పూజలు

HYD: ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీలో, శ్రీ శివాలయం ప్రాంగణములో గల శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో బుధవారం ఉదయం అమావాస్య సందర్భంగా శ్రీ కాలభైరవ స్వామి వారికి అభిషేకం చేశారు. అనంతరం స్వామి వారిని మందార పూలు, రుద్రాక్ష మాల, చందనం , కుంకుమ తిలకాలతో అలంకరించారు. బూడిద గుమ్మడికాయలతో స్వామి వారికి దీపారాధన చేశారు.