రోడ్డు ప్రమాదంలో చిత్తూరు వాసి మృతి

రోడ్డు ప్రమాదంలో చిత్తూరు వాసి మృతి

CTR: తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట రోడ్ తుడా ఆఫీస్ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. చిత్తూరు టౌన్ చామంతి పురం నివాసి కొమరవెల్లి కార్తీక్ (26) అనే వ్యక్తి మృతి చెందినట్లు తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ టి. చిన్ని గోవిందు తెలిపారు. ఈ మేరకు మృతుడి తల్లి సుధ ఫిర్యాదు మేరకు తిరుపతి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.