ఉపాధ్యాయురాలు త్వరగా కోలుకోవాలి: డీఈఓ

KRNL: పాఠాశాలకు వెళ్లే సమయంలో యాక్సిడెంట్‌కు గురై తీవ్ర గాయాలైన SGT ఉపాధ్యాయురాలు ఇందిరా త్వరగా కోలుకోవాలని డీఈఓ శామ్యూల్ పాల్ ఆకాంక్షించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను ఉపాధ్యాయ సంఘం నేత హృదయ రాజుతో కలిసి ఆయన పరామర్శించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డీఈఓ మాట్లాడి ఉపాధ్యాయురాలికి ఉత్తమ వైద్యం అందించాలని కోరారు.