మంగళగిరి బెటాలియన్‌లో విషాదం

మంగళగిరి బెటాలియన్‌లో విషాదం

GNTR: మంగళగిరి 6వ బెటాలియన్‌లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. పీపీటీ టెస్టులో పాల్గొన్న డాగ్ స్క్వాడ్ హెడ్ కానిస్టేబుల్ కె.వెంకటేశ్వరరావు అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందారు. ఆయన్ను వెంటనే ఎయిమ్స్‌కు తరలించినా ఫలితం లేకపోయింది. వెంకటేశ్వరరావు మృతితో బెటాలియన్‌లో విషాదం నెలకొంది.