మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే
PDL: మాచవరం(మం) పిల్లోట్ల గ్రామంలో గుర్రం వీరగోపాల కృష్ణారెడ్ల ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని గురజాల నియోజకవర్గం ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు తనిఖీ చేశారు. ముందుగా పాఠశాల ప్రాంగణాన్ని, తరగతి గదులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మధ్యాహ్న భోజనం చేశారు. అలానే, విద్యార్థులతో ముచ్చటించి వారి అభిప్రాయాలను తీసుకున్నారు.