ఉచిత చికెన్ ఫ్రై, ఎగ్స్.. ఎగబడ్డ జనాలు

ఉచిత చికెన్ ఫ్రై, ఎగ్స్.. ఎగబడ్డ జనాలు

SRD: హత్నూర మండలం దౌల్తాబాదులో ఓ చికెన్ సెంటర్‌లో చికెన్ ఫ్రై, ఎగ్స్‌లను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ మేళాకు జనాలు పోటెత్తారు. ఒకవైపు బర్డ్ ఫ్లూ వైరస్‌తో పౌల్ట్రీ ఫార్మ్స్‌లో కోళ్లు మృత్యువాత పడుతున్నట్లు ఆరోపణలు వినిపించినా చికెన్ సంస్థ నిర్వాహకులు వైరస్ రాదు అంటూ పంపిణీలో ప్రచారం చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పలువురు తెలిపారు.