పార్కులను పరిశుభ్రంగా ఉంచండి: కమిషనర్

GNTR: పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ల రమేష్ బాబు శుక్రవారం పట్టణంలోని అంబేడ్కర్ పార్క్, పెద్దన్న పార్క్‌లను సందర్శించారు. పార్కులు కేవలం కాలక్షేపానికే కాకుండా, కుటుంబ సభ్యులతో గడిపేందుకు, శారీరక వ్యాయామం చేసేందుకు ఉపయోగపడతాయని ఆయన అన్నారు. ఈ పార్కులను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని కమిషనర్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.