చెన్నూరులో నష్టపోయిన పంటల పరిశీలన

MNCL: చెన్నూరు మండలం సుందరశాలలో కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో నష్టపోయిన పంట పొలాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి మంత్రి వివేక్ వెంకటస్వామి మంగళవారం పరిశీలించారు. బ్యాక్ వాటర్‌తో పత్తి పంట పూర్తిగా నష్టపోయిందని రైతులు మంత్రికి తెలిపారు. పంట నష్టం గురించి వ్యవసాయశాఖ అధికారుల వద్ద వివరాలు తెలుసుకొని నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు.