రైతులకు మరో రెండు రోజులే గడువు

BPT: అద్దంకి మండలంలో 'అన్నదాత సుఖీభవ' నగదు జమకాని రైతులు 102 మంది ఉన్నట్లు ఏవో వెంకటకృష్ణ సోమవారం తెలిపారు. ఆధార్ ఇనాక్టివ్, ఎన్‌పీసీ వంటి కారణాలతో నగదు జమ కాలేదని ఆయన చెప్పారు. ఈనెల 20వ తేదీలోగా సమస్యను పరిష్కరించుకుని గ్రీవెన్స్‌లో అప్లై చేసుకుంటే ప్రభుత్వం వారికి మరల నగదు జమ చేస్తుందని ఆయన పేర్కొన్నారు. కావున రైతులందరూ ఈ విషయాన్ని గమనించాలని కోరారు.