బొర్రా అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం

బొర్రా అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం

విశాఖ జిల్లా: అనంతగిరి బొర్రా నిన్ని మామిడి అంగన్వాడీ కేంద్రంలో బుధవారం పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సెక్టర్ సూపర్‌వైజర్ సత్యవతి మాట్లాడుతూ... గర్భవతులు బాలింతలు, కిశోర బాలికలకు సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరించి తెలిపారు. అనంతరం బాల్య వివాహాలను అరికట్టడం, కిశోర బాలికల ప్రాముఖ్యతపై ఆమె వివరంగా తెలిపారు.