'అభ్యర్థులు తప్పనిసరిగా నియమావళి పాటించాలి'
NLG: శాలిగౌరారం మండలంలోని 24 గ్రామాల్లో ఎన్నికలు సజావుగా జరగాలంటే సర్పంచ్ అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల నియమాలు పాటించాలని తహసీల్దార్ బిట్ల వరప్రసాద్ తెలిపారు. ప్రచార వాహనాలు, లౌడ్‌స్పీకర్లు, ఊరేగింపులకు ముందే అనుమతి తీసుకోవాలని సూచించి, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.