VIDEO: గుంటూరులో సావిత్రీబాయి పూలేకు ఘన నివాళి
GNTR: గుంటూరు హిందూ కళాశాల కూడలిలో సావిత్రీబాయి పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని దళిత, బీసీ, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా మంగళవారం మున్సిపల్ ట్రావెలర్స్ బంగళాలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశానికి ఆమె చేసిన సేవలను గుర్తించి తక్షణమే 'భారతరత్న' ప్రకటించాలని కోరారు.