VIDEO: భీమారం బ్రిడ్జి వద్ద వరద ఉధృతి

VIDEO: భీమారం బ్రిడ్జి వద్ద వరద ఉధృతి

NLG: భారీ వర్షాల కారణంగా మూసి నది గేట్లను తెరిచారు. కేతేపల్లి మండలం భీమారం బ్రిడ్జి వద్ద వరద ఉధృతి భీకరంగా ఉంది. బ్రిడ్జి పై నుంచి మూడు ఫీట్ల పైన నీళ్లు వెళ్తున్నాయి. సూర్యాపేట, మిర్యాలగూడ రాకపోకలు బంద్ అయ్యాయి. ఈ రహదారి గుండా ఎవరు ప్రయాణించవద్దని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. వరద ప్రభావం రెండు మూడు రోజులు ఉండే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.